ఫొటోలు పంపిన చంద్రయాన్‌–2

5 Aug, 2019 03:50 IST|Sakshi

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గత నెల 22వ తేదీన ప్రయోగించిన చంద్రయాన్‌–2 తొలిసారి అంతరిక్షం నుంచి తీసిన భూమి ఫొటోలను పంపింది. ప్రస్తుతం చంద్రయాన్‌–2 భూమికి–చంద్రుడికి మధ్యలోని భూమధ్యంతర కక్ష్యలో పరిభ్రమిస్తోంది. శనివారం సాయంత్రం 5.28 గంటలకు భూమిని ఉత్తరం ధృవం వైపు నుంచి తీసిన ఐదు ఫొటోలను ఆదివారం ఇస్రో తన సొంత వెబ్‌సైట్‌లో అధికారికంగా విడుదల చేసింది.

చంద్రయాన్‌–2 కక్ష్య దూరాన్ని ప్రస్తుతం భూమికి దగ్గరగా 277 కిలోమీటర్లకు, దూరంగా 89,472 కిలోమీటర్ల ఎత్తుకు పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భూమికి 5,000 కిలోమీటర్ల దగ్గరగా వచ్చిన సమయంలో 10 నిమిషాల వ్యవధిలో ఐదు ఫొటోలను తీసి బెంగళూరు సమీపంలోని బైలాలు భూ నియంత్రిత కేంద్రానికి పంపింది. చంద్రయాన్‌–2లో ఉన్న ల్యాండర్‌ (విక్రమ్‌)లో ఎల్‌–14 కెమెరా ఈ చిత్రాలను తీసింది. చంద్రుడి ఉపరితలం మీద దిగే 15 నిమిషాలు విజయవంతమైతే చంద్రయాన్‌–2 యాత్ర సజావుగా సాగినట్టేనని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఫొటోలు ఎప్పుడెప్పుడంటే..
భూమికి ఉత్తర ధృవం నుంచి 5 వేల కిలోమీటర్ల ఎత్తులో ఒక ఛాయా చిత్రం, 5.29 గంటలకు 4,700 కిలోమీటర్ల్ల ఎత్తులోకి వచ్చాక మరో ఛాయాచిత్రాన్ని తీసింది. ఆ తరువాత  5.31 గంటలకు 4,100 కిలోమీటర్ల్ల ఎత్తు నుంచి, 17.34 గంటలకు 3,200 కిలో మీటర్ల ఎత్తు నుంచి, 17.37 గంటలకు 2,450 కిలోమీటర్ల ఎత్తు నుంచి మరో మూడు ఛాయా చిత్రాలను తీసి పంపింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రూ.లక్ష ఎద్దులు రూ.50 వేలకే

బీజేపీ ఎమ్మెల్యేపై రూ. 204 కోట్ల దావా 

ఆ శక్తులపై విజయం సాధిస్తాం

విడిపోని స్నేహం మనది

ఓటేయని వాళ్లనూ గెలుచుకోవాలి

రాష్ట్రపతి​కి గునియా అత్యున్నత పురస్కారం

ఆమె అంగీకరిస్తే.. పార్టీ అధ్యక్షురాలు అవుతారు!

ఈనాటి ముఖ్యాంశాలు

35ఏ రద్దు? కశ్మీర్‌లో హైటెన్షన్‌.. క్షణక్షణం ఉద్రిక్తత

ముంబైని ముంచెత్తిన వరద

ఎక్కడ చూసినా మొసళ్లే.. బిక్కుబిక్కుమంటూ జనం!

ఆ అనుబంధం కంటే గొప్పదేదీ లేదు : సీఎం

బోఫోర్స్‌ గన్స్‌తో చుక్కలు..

ఢిల్లీకి చేరుకున్న శ్రీనగర్‌ నిట్‌ తెలుగు విద్యార్థులు..

తల్లీకూతుళ్లను రైల్లో నుంచి తోసి...

దారుణం : 90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం

రాహుల్‌ వారసుడి ఎంపిక ఎప్పుడంటే..

కశ్మీర్‌లో ఏం జరుగుతోంది..?

మూకదాడిలో వ్యక్తి మృతి: 32 మంది అరెస్ట్‌

కశ్మీర్‌పై షా కీలక భేటీ.. రేపు కేబినెట్‌ సమావేశం!

డ్యాన్స్‌లు చేశారు.. సస్పెండ్‌ అయ్యారు

నీలిరంగులో మెరిసిపోతున్న భూమి

ఉన్నావ్‌ కేసు: 17 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు

పాక్‌కు భారత ఆర్మీ సూచన..

కశ్మీర్‌ ఉద్రిక్తత: ఎయిర్‌ ఇండియా కీలక ప్రకటన

అంతుపట్టని కేంద్ర వైఖరి, త‍్వరలో అమిత్‌ షా పర్యటన

గాంధీ, గాడ్సేపై సభలో దుమారం

ఆమెతో చాటింగ్‌ చేసి అంతలోనే..

దేవెగౌడ ఇంటికెళ్తే టీ కూడా ఇవ్వలేదు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వారం రోజులపాటు ఆశ్రమంలో

ఆ పాత్రలో తానెలా నటించినా ఆమెతో పోల్చరాదు

సౌత్‌ ఎంట్రీ?

దోస్త్‌ మేరా దోస్త్‌

చూసీ చూడంగానే...

బందోబస్త్‌కు సిద్ధం