తమిళనాడులో ఐటీ దాడులు

29 Jan, 2019 13:38 IST|Sakshi

సాక్షి, చెన్నై : పన్ను ఎగవేత, నల్లధనంపై అందిన ఫిర్యాదుల నేపథ్యంలో మంగళవారం ఆదాయ పన్ను శాఖ తమిళనాడులోని దాదాపు 70 ప్రదేశాల్లో దాడులు చేపట్టింది. చెన్నై, కోయంబత్తూర్‌ సహా పలు ప్రాంతాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. రిటైలర్‌ శరవణ స్టోర్స్‌, రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు జీస్క్వేర్‌, లోటస్ గ్రూప్‌ సహా పలు సంస్ధలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

కాగా, గతంలో ఐటీ అధికారులు చెన్నైలోని పాపులర్‌ కేఫ్‌, గ్రాండ్‌ స్వీట్స్‌, హాట్‌ బ్రెడ్స్‌, శరవణ భవన్‌, అంజప్పర్‌ గ్రూప్‌ సహా పలు రెస్టారెంట్‌ చైన్స్‌పై దాడులు చేపట్టారు. ఈ రెస్టారెంట్ల డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాలపైనా 100 మందికి పైగా అధికారుల బృందం సోదాలు, దాడులు చేపట్టింది. ఆయా సంస్ధలు తమ ఆదాయాన్ని తక్కువగా చూపడం, పన్ను ఎగవేతలకు పాల్పడటం వంటి ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు సోదాలు, దాడులు నిర్వహించారు.

>
మరిన్ని వార్తలు