చిన్నారికి పాలు తెచ్చిన మహిళా పోలీస్‌

18 Jun, 2020 16:17 IST|Sakshi

రాంచీ : కరోనా ఓ వైపు మానవాళిపై మృత్యు ఘంటికలు మోగిస్తుంటే.. మరోవైపు ప్రజల నుంచి మానవత్వం పరిమళిస్తోంది. లాక్‌డౌన్‌లో అష్టకష్టాలు ఎదుర్కొంటున్న వారికి ఎంతో మంది అండగా ఉంటూ తనదైన సాయం అందిస్తున్నారు. ఇలాంటి ఎన్నో అపురూప దృశ్యాలు మన కంటికి తారసపడతునే ఉన్నాయి. తాజాగా అలాటి ఓ సన్నివేశం మరోసారి కంటపడింది. ఈ సంఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుందిది. నాలుగు నెలల పిల్లవాడితో మెహరున్నీసా అనే మహిళ బెంగుళూరు నుంచి గోరఖ్‌పూర్‌కు శ్రామిక్‌ రైల్లో ప్రయాణం చేస్తోంది. రైలు హటియా  రైల్వే స్టేషన్‌లో ఆగడంతో శిశువు పాల కోసం ఏడవడంతో తల్లి తన పిల్లవాడి కోసం పాలు కావాలని స్థానికంగా ఉన్న అధికారులను కోరింది. (‘సెల్యూట్‌ పోలీస్‌.. మీపై గౌరవం పెరిగింది’)

మెహరున్నీసా దీన స్థితిని స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సుశీల అనే మహిళా పోలీస్‌ అధికారి(ఏఎస్సై) తెలుసుకుంది. ఆమె ఇల్లు స్టేషన్‌కు సమీపంలో ఉండటంతో తన ఇంటికి వెళ్లి శిశువు కోసం సీసాలో పాలు తీసుకొచ్చారు. ఈ విషయాన్ని రాంచీ పోలీస్‌ అధికారులు ట్విటర్‌లో పోస్ట్‌ చేయడంతో వెలుగులోకి వచ్చింది. రైల్వే స్టేషన్‌లో పోలీసు అధికారి పాల సీసాను మెహరున్నీసాకు అందించిన ఫోటోను కూడా రాంచీ అధికారులు సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. కాగా గత నెలలో ఇలాంటి ఘటనే భోపాల్‌ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. రైలులో గుక్కపట్టి ఏడుస్తున్న నాలుగేళ్ల చిన్నారికి ఆర్‌పీఎఫ్‌ జవాన్‌ పాల ప్యాకెట్‌ కొని తెచ్చి రియల్‌ హీరో అనిపించుకున్నాడు. (చైనాతో దౌత్య యుద్ధం చేయాల్సిందే! )

మరిన్ని వార్తలు