తండ్రి ఉద్యోగం గురించి మోదీకి లేఖ రాసిన బాలుడు

8 Jun, 2019 14:28 IST|Sakshi

లక్నో : ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌కు చెందిన ఎనిమిదో తరగతి బాలుడు తన తండ్రిని తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సిందిగా కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాడు. ఇలా ఇప్పటి వరకూ దాదాపు 37 లేఖలు రాశాడు. సర్థాక్‌ త్రిపాఠి అనే బాలుడి తండ్రి ఉత్తరప్రదేశ్‌ స్టాక్‌ ఎక్సెంజ్‌ కార్యాలయంలో అధికారిగా పని చేస్తుండేవాడు. 2016లో అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. దాంతో సదరు బాలుడు తన తండ్రికి ఉద్యోగాన్ని తిరిగి ఇప్పించాల్సిందిగా కోరుతూ మోదీకి లేఖలు రాశాడు. ఈ ఉత్తరాల్లో తన తండ్రిని బలవంతంగా ఉద్యోగం నుంచి తొలగించారని తెలిపాడు. తండ్రి ఉద్యోగం పోవడం వల్ల తమ కుటుంబం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుందని వాపోయాడు.

తన తండ్రికి తిరిగి ఉద్యోగాన్ని ఇప్పించాల్సిందిగా కోరాడు. అంతేకాక మోదీ ఉంటే సాధ్యమే అనే నినాదాన్ని తాను నమ్ముతున్నానని తెలిపాడు. తనకు సాయం చేసి.. న్యాయం చేయాల్సిందిగా కోరాడు. ఇలా ఇప్పటి వరకూ 37 ఉత్తరాలు రాశాడు. కానీ ఒక్కదానికి కూడా ప్రత్యుత్తరం రాలేదని తెలిపాడు.

మరిన్ని వార్తలు