పుల్వామాలో ఎన్‌కౌంటర్‌; ముగ్గురు ఉగ్రవాదులు హతం

26 Jun, 2020 10:38 IST|Sakshi

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య మరోసారి ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. పుల్వామా జిల్లా త్రాల్‌ సెక్టార్‌లోని చేవా ఉల్లార్‌ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. గురువారం ప్రారంభమైన ఈ కాల్పులు శుక్రవారం ఉదయం వరకు కొనసాగాయి. త్రాల్‌ సెక్టార్‌లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు నిఘా వర్గాల నుంచి పోలీసులకు, సీఆర్పీఎఫ్‌ బృందాలకు సమాచారం అందడంతో భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సైనిక దళాల కదలికలలను గుర్తించిన ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు.దీంతో ఉగ్రవాదులపై బలగాల ఎదురు కాల్పులు జరపడంతో ముగ్గరు ఉగ్రవాదులు మరణించారు. (కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ : ఇద్దరు ఉగ్రవాదులు మృతి)

ఈ కాల్పులపై పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యం ముగ్గురు ఉగ్రవాదులను మట్టు బెట్టినట్లు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సాయుధ దళాల సిబ్బందికి కూడా గాయాలయ్యాని వెల్లడించారు. కాగా కాల్పుల్లో మరణించిన ముగ్గురు ఉగ్రవారులు స్థానికి ట్రాల్‌ ప్రాంతానికి చెందిన వారని, ఆయుధాలతో ఉగ్రవాదంలో చేరినట్లు స్పష్టం చేశారు. ఇక ఈ నెలలో ఇది దక్షిణ కశ్మీర్‌లో జరిగిన 12వ ఎన్‌కౌంటర్‌. ఇప్పటి వరకు 33 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. (భారత్‌లో ఒక్క రోజే 17,296 కరోనా కేసులు)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా