మధ్యప్రదేశ్‌లో చిన్నారులపై రేప్‌కు మరణశిక్షే!

26 Nov, 2017 18:56 IST|Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఇటీవల అత్యాచార ఘటనలు పెరిగిపోతుండటంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 12 ఏళ్లు అంతకన్నా తక్కువ వయసున్న బాలికలపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణశిక్ష విధించేలా చట్టం రూపకల్పనకు అంగీకరించింది.

మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలో ఆదివారం నాడిక్కడ సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లును సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి జయంత్‌ మీడియాకు తెలిపారు. తాజా బిల్లులో భాగంగా మహిళల్ని వేధించే దోషులకు శిక్షల్ని కఠినతరం చేశామనీ, వారికి రూ.లక్ష మేర జరిమానా కూడా విధిస్తామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు