కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించిన మమత

7 Aug, 2019 20:29 IST|Sakshi

చెన్నై: కరుణానిధి ప్రథమ వర్థంతి సందర్భంగా బుధవారం తమిళనాడుకి వచ్చిన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోడంబాక్కంలోని మురసొలి కార్యాలయంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌, పుదుచ్చేరి సీఎం వి. నారాయణసామి తదితరులు హాజరయ్యారు.

మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి ఫరూక్ అబ్దుల్లా రావాల్సి ఉన్నా, చివరి నిమిషంలో రాలేకపోయారని తెలిపారు. ఫరూక్‌ అబ్దుల్లా తన కుమార్తె ఇంటికి కూడా వెళ్లలేని పరిస్థితిలో ఏడుస్తున్న వీడియోనూ  తాను నిన్న చూశానని మమతా పేర్కొన్నారు. కశ్మీర్‌లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఆ వీడియోనే నిదర్శనమని వెల్లడించారు. ఇది నిజంగా ఆందోళన చెందాల్సిన విషయమని, ఒక రాష్ట్రంపై నిర్ణయం తీసుకునే ముందు అక్కడి ప్రజల అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కానీ ఇవేవి పరిగణలోకి తీసుకోకుండా బీజేపీ ప్రభుత్వం కశ్మీర్‌ విషయంలో సొంత నిర్ణయం తీసుకోవడం దారుణమని మమత విమర్శించారు.


 

మరిన్ని వార్తలు