సీఎంకు తప్పిన ప్రమాదం..ఎయిర్‌ ఇండియాకు చురకలు

20 Jan, 2018 13:17 IST|Sakshi

గువహటి:  మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌  తృటిలో భారీ ప్రమాదంనుంచి తప్పించుకున్నారు. ఎయిర్‌ ఇండియా విమానం లాండింగ్‌ సమయంలో అకస్మాత్తుగా పక్షి అడ్డం రావడంతో  కాసేపు  ఉద్రిక్త వాతావరణం నెలకొంది.   అదృష్టవశాత్తూ త్రుటిలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్వయంగా సీఎం ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో వెల్లడించారు. తనకు జరిగిన ప్రమాదంపై  బీరేన్‌ సింగ్‌ ట్విటర్‌లో వెల్లడించడంతో పాటు.. ప్రయాణీకులకు సరైన సౌకర్యాలుకల్పించలేకపోయిందంటూ  ఎయిర్‌ ఎండియా యాజమాన్యంపై స్వయంగా సీఎం  ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.

గువహటి ఎయిరిండియా విమారం ఇంపాల్‌ వెడుతుండగా శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. 160 మందితో ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఎయిరిండియా విమానానికి పక్షి తగిలిందని, కానీ గువహటిలో సురక్షితంగా ల్యాండ్‌ అయ్యిందని శుక్రవారం బీరేన్‌ ట్వీట్‌ చేశారు.  పక్షి తాకి వుంటే.. రంధ్రం పడేదనీ.. కానీ  అప్పటికే విమానం ల్యాండ్‌ అవుతూ వుండడంతో భారీ ప్రమాదం తప్పిందని  పేర్కొన్నారు.  అక్కడి  మేనేజ్‌మెంట్‌ తీరు అస్సలు బాగోలేదంటూ, వసతులు చాలా పేలవంగా ఉన్నాయంటూ బీరేన్‌ ట్విటర్‌లో ఆరోపించారు. ఇంకా చాలామంది ప్రయాణికులు విమానంలోనే ఉండిపోయారని, ఆహారం, వసతి లాంటివేవీ లేదన్నారు.  శనివారం మధ్యాహ్నం వరకు మరో విమానం అందుబాటులో లేదని కూడా అధికారులు తెలిపినట్లు బీరేన్‌ ట్వీట్‌ చేశారు.

మరోవైపు ఈ సంఘటనపై ఎ యిరిండియాకూడా స్పందించింది. ప్రమాద  విషయాన్ని ధ్రువీకరించిన  సంస్థ అధికార ప్రతినిధి..  ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు  ప్రయత్నిస్తున్నామన్నారు. కోలకతానుంచి తమ ఇంజనీర్ల బృందం పరిశీలనకు వెళ్లినట్టు చెప్పారు. అలాగే  మరో విమానం  ద్వారా ఈ మధ్యాహ్నానికి సంబంధిత ప్రయాణీకులను ఇంపాల్‌ చేర్చేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
 

మరిన్ని వార్తలు