మంత్రి అక్రమాస్తులు రూ.115 కోట్లు

24 Jan, 2017 15:52 IST|Sakshi
మంత్రి అక్రమాస్తులు రూ.115 కోట్లు

సాక్షి, బెంగళూరు: ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాల్లో కర్ణాటక చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి రమేష్‌ జారకీహోళీకి చెందిన అక్రమ ఆస్తులు భారీగా వెలుగుచూస్తున్నాయి. మొత్తం రూ.115.2 కోట్ల మేరకు ఆస్తులను గుర్తించారు. బెంగళూరు, బెళగావి, గోకాక్‌ ప్రాంతాల్లో రమేష్‌ గృహ సముదాయాలు, కార్యాలయాలతోపాటు ఆయన బంధువుల ఇళ్లపై నాలుగు రోజులుగా ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత తన వద్ద ఉన్న నగదును మార్చుకునేందుకు మంత్రి అక్రమమార్గం పట్టినట్లు అధికారులు చెబుతున్నారు.

ముఖ్యంగా సహకార బ్యాంకుల్లో బంధువులు, స్నేహితుల పేర్లపై అకౌంట్‌లను తెరిచి అందులో నగదును డిపాజిట్‌ చేస్తూ వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తన వద్ద ఉన్న నగదుతో భారీ స్థాయిలో బంగారం బిస్కెట్లు, నగలు కొనుగోలు చేశారు.  మరోవైపు స్థిర, చరాస్తులను సైతం నోట్ల రద్దు తర్వాతే ఎక్కువ సంఖ్యలో కొన్నట్లు తెలుస్తోంది.  ఇలా ఉండగా,  బెళగావి నగరంలో కర్ణాటక పీసీసీ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీహెబ్బళ్కర్‌ నివాసంలో జరిపిన ఐటీ సోదాల్లో రూ.50 కోట్ల విలువైన నగదు, బంగారం బయటపడ్డాయి.

మరిన్ని వార్తలు