పత్తి రికార్డు ధర.. క్వింటాలు రూ. 5,725

24 Jan, 2017 03:10 IST|Sakshi
పత్తి రికార్డు ధర.. క్వింటాలు రూ. 5,725

మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం పత్తి క్వింటాలుకు రూ. 5,725 ధర పలికింది. మార్కెట్‌కు 6434 క్వింటాళ్ల పత్తి రాగా, కనిష్ట ధర క్వింటాల్‌కు రూ.5,205, మోడల్‌ ధర క్వింటాల్‌కు రూ. 5,555, మ్యాగ్జిమం ధర క్వింటాల్‌కు రూ. 5,725 పలికింది. కేసముద్రం మార్కెట్లో కనిష్టంగా రూ. 5,150, గరిష్ఠంగా రూ. 5,605 ధర పలికింది.

వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని ఏనుమాముల మార్కెట్‌ యార్డ్‌లో గరిష్ఠంగా రూ. 5,475, కనిష్ఠంగా రూ. 5,250 ధర పలికింది. ఈ ఏడాది పత్తి సీజన్‌లో ధరలు పెరుగుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకు ధరలు పెరుగుతుండడంతో రైతులు తమ ఇళ్లలో దాచుకున్న పత్తికి మరింత ధర వస్తుందన్న ఆశగా ఎదురుచూస్తున్నారు.
 

మరిన్ని వార్తలు