మెట్రో ప్రయాణికుడిని చెంపదెబ్బ కొట్టిన స్టాలిన్

2 Jul, 2015 16:37 IST|Sakshi
మెట్రో ప్రయాణికుడిని చెంపదెబ్బ కొట్టిన స్టాలిన్

మెట్రో రైలులో తొలిసారి ప్రయాణం చేసిన డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్.. అక్కడ ఓ ప్రయాణికుడిపై చేయిచేసుకున్నారు. కార్యకర్తలతో కలిసి మెట్రో రైలు ఎక్కిన స్టాలిన్.. అక్కడ ఉన్న ప్రయాణికులను అడ్డు జరగాలని అన్నారు. తన పక్కనే ఉన్న ఓ ప్రయాణికుడిని పక్కకు జరగాలని కాస్త గట్టిగా చెప్పగా, అతడు అందుకు తిరస్కరించాడు.

దాంతో స్టాలిన్ అతడిని వెంటనే చెంపదెబ్బ కొట్టారు. స్టాలిన్ చేసిన ఈ నిర్వాకాన్ని అక్కడే ఉన్న మరో ప్రయాణికుడు తన మొబైల్ ఫోన్లో వీడియో తీశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. డీఎంకే నాయకుడి తీరుపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. కాగా, తాను ప్రయాణికులతో మాట్లాడానని, వాళ్లలో ఎక్కువ మంది మెట్రో చార్జీ తగ్గించాల్సిందిగా కోరారని స్టాలిన్ అన్నారు. మెట్రో రైళ్లు రావడం వల్ల రోడ్ల మీద వాహనాల రద్దీ తగ్గుతుందని, ప్రయాణ సమయం కూడా బాగా తగ్గుతుందని ఆయన చెప్పారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు