ఎన్నికల చట్టాన్ని సవరించండి: ఈసీ

7 Jun, 2016 02:27 IST|Sakshi

న్యూఢిల్లీ: ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బును ఉపయోగిస్తున్నారన్న సాక్ష్యాలు లభిస్తే.. ఎన్నికల సంఘానికి సంబంధిత ఎన్నికను రద్దు చేయడం కానీ, వాయిదా వేయడం కానీ చేసే అధికారం కల్పించేందుకు ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాలని ఈసీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

అందుకు గానూ ప్రజా ప్రాతనిధ్య చట్టంలో కొత్తగా 58బీ నిబంధనను చేర్చాలని న్యాయశాఖ కు లేఖ రాసింది. సంబంధిత అధికారాన్ని ఈసీకి కల్పించే నిబంధన రాజ్యాంగంలో(324వ అధికరణం) ఉన్నప్పటికీ.. రాజ్యాంగం కల్పించిన ఆ అధికారాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం లేకుండా, ఎన్నికల చట్టంలోనే ఆ నిబంధనను పొందుపరిస్తే బావుంటుందని ఆ లేఖలో ఈసీ పేర్కొంది.

మరిన్ని వార్తలు