రుతు పవనాల రాక మరింత ఆలస్యం

2 Jun, 2019 05:54 IST|Sakshi

న్యూఢిల్లీ: రుతుపవనాల రాక మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని ప్రైవేట్‌ వాతావరణ సంస్థ స్కైమెట్‌ తాజాగా అంచనా వేసింది. రుతుపవనాల్లో మందగమనం కారణంగా జూన్‌ 7వ తేదీకి రెండు రోజులు అటూఇటుగా కేరళను తాకనున్నాయని పేర్కొంది. ఇంతకు ముందు అంచనా ప్రకారం జూన్‌ 4వ తేదీకి రెండు రోజులు అటూఇటుగా కేరళను తాకవచ్చని తెలిపింది. రుతుపవనాల పురోగమనం మందకొడిగా సాగడంతో ఈ అంచనాలను మార్చుకోవాల్సి వచ్చిందని స్కైమెట్‌ ప్రెసిడెంట్‌ జీపీ శర్మ తెలిపారు. రుతుపవనాలు నెమ్మదిగా కదలటానికి సొమాలియా తీరంలో అల్పపీడనం, మధ్య అరేబియా సముద్రంపై అధికపీడనం, సొమాలియా తీరంపై వైపు నుంచి వీస్తున్న బలమైన గాలులే కారణమన్నారు.

మరిన్ని వార్తలు