ముంబై హైకోర్టు సంచలన తీర్పు

2 Apr, 2017 22:32 IST|Sakshi
ముంబై హైకోర్టు సంచలన తీర్పు
అప్పు తీర్చాలని వేధించడం ఆత్మహత్యకు ప్రేరేపించడమే
ముంబై:  తీసుకున్న అప్పును తిరిగి చెల్లించాలని మాటలతో, శారీరకంగా వేధించడం కూడా ఆత్మహత్యకు ప్రేరేపించడమేనని బాంబే హైకోర్టు ఆదివారం తేల్చి చెప్పింది. గురునాథ్‌ గావ్లీ, సంగీతా గావ్లీ అనే ఇద్దరు లైసెన్సులున్న రుణదాతలు తమపై దాఖలైన ఆత్మహత్యకు ప్రేరేపించడం అనే కేసును కొట్టేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు.
 
ఆ పిటిషన్‌ను కొట్టేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఉమేశ్‌ బాంబ్లే అనే ముంబై నగరవాసి వీరి వద్ద రూ.19 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఇతను డబ్బు తిరిగివ్వడంలో విఫలమవ్వడంతో వీరిద్దరూ ఇతన్ని మాటలతో వేధించారు. కొన్ని సందర్భాల్లో భౌతిక దాడులు కూడా చేశారు. దీంతో అతను ఆత్మహత్యాయత్నం చేయడంతో అతని భార్య సునీత వీరిద్దరిపై కేసు పెట్టింది.
 
ప్రతిరోజూ అతన్ని అప్పు కట్టాలని ఒత్తిడి చేయడం ఓ సాధారణ మధ్యతరగతి వ్యక్తిని ఆత్మహత్యాయత్నానికి పురికొల్పిందని న్యాయమూర్తి జస్టిస్‌ బాడర్‌ అభిప్రాయపడ్డారు. అతని ఇంట్లో, పనిచేసే ప్రదేశంలో అతన్ని పదేపదే అవమానాలకు గురిచేయడం, భౌతికదాడులు చేయడంతో అతను తీవ్ర మనోవేదనకు లోనయ్యాడని  పేర్కొన్నారు. 
మరిన్ని వార్తలు