ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తోన్న ‘కికి’

27 Jul, 2018 17:18 IST|Sakshi

ముంబై : మన భాగ్యనగరంలో అంతగా ప్రాచుర్యం పొందలేదు కానీ.. విదేశాల్లో, ముంబై లాంటి మెట్రోల్లో, ఇప్పటికే విపరీతమైన క్రేజ్‌ తెచ్చుకుంది ‘కికి చాలెంజ్‌’. మన యువతకు ఇంకా పరిచయం కానీ ఈ నయా చాలెంజ్‌ ఇప్పటికే యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోంది. కానీ ఈ చాలెంజ్‌ను స్వీకరించడం అంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే అంటున్నారు ముంబై పోలీసులు. ‘కికి చాలెంజ్‌’ అంటూ రోడ్ల మీద ఎటువంటి విన్యాసాలు చేసిన ఊరుకోబోమని, వారి మీద తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ట్విట్టర్‌ కూడా ఈ ‘కికి చాలెంజ్‌’ను ప్రమాదకరం అని ప్రకటించిందని తెలిపారు.

ఏంటి కికి చాలెంజ్‌...
ఈ మధ్యే ‘హట్‌లైన్‌ బ్లింగ్‌’ సింగర్‌ డ్రేక్‌ తన కొత్త పాట ‘ఇన్‌ మై ఫీలింగ్స్‌’ను విడుదల చేశారు. అయితే పాట విడుదలతో పాటు ఈ ‘కికి చాలెంజ్‌’ను కూడా జనాల్లోకి వదిలారు. ఈ చాలెంజ్‌ తీసుకున్న వారు కదులుతున్న వాహనంలోంచి దిగి లేదా వాహనంలోనే ఉండి ‘ఇన్‌ మై లైఫ్‌’ పాటకు అనుగుణంగా.. కదులుతున్న వాహహంతోపాటు వారు డ్యాన్స్‌ చేయాల్సి ఉంటుంది. పాట అయిపోయాక తిరిగి వాహనంలోకి ఎక్కాలి. అయితే కింద పడకూడదు, మధ్యలో ఆగకూడదు. అలా చేస్తేనే చాలెంజ్‌ నెగ్గినట్లు.

మొదటి వ్యక్తి అతడే..
అయితే ఈ చాలెంజ్‌ను ముందుగా ‘షిగ్గీ’ అనే సోషల్‌ మీడియా హస్యనటుడు ప్రారంభించారు. షిగ్గీ ఈ చాలెంజ్‌ను స్వీకరించి.. దానిలోని సూచనల ప్రకారం డ్యాన్స్‌ చేసిన వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్‌ చేశారు. అనాటి నుంచి ఈ ‘కికి చాలెంజ్‌’..‘షిగ్గి  డ్యాన్స్‌’ గా కూడా  ప్రచారం అవుతోంది. ఈ చాలెంజ్‌ స్వీకరించిన వారిలో ప్రముఖ హలీవుడ్‌ నటుడు విల్‌ స్మిత్‌ కూడా ఉన్నారు. స్మిత్‌ తన కికి చాలెంజ్‌ వీడియోను ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేసిన దగ్గరి నుంచి దీనికి విపరీతమైన క్రేజ్‌ వస్తోంది.

ప్రమాదం అంటున్న నిపుణులు...
యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ చాలెంజ్‌ చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. ‘కదులుతున్న వాహనంతో పాటుగా డ్యాన్స్‌ చేస్తూ కదలడం అనేది చాలా ప్రమాదం. ఎందుకంటే రోడ్ల మీద నిత్యం వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. ఇలా రోడ్డు మీద డ్యాన్స్‌ చేయడం వల్ల కేవలం డ్యాన్స్‌ చేసిన వారికే కాక అవతలి నుంచి వచ్చే వాహనదారులకు కూడా ప్రమాదమే. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండటం మేలు’ అంటున్నారు నిపుణులు. అంతేకాక ఈ చాలెంజ్‌ స్వీకరించిన చాలా మంది దానిని సరిగా నిర్వర్తించలేక ప్రమదాలకు గురయ్యారు. అందువల్లే ఇలాంటి ప్రయోగాలకు దూరంగా ఉండండని సలహ ఇస్తున్నారు.

వారిస్తోన్న ముంబై పోలీసుల...
ఇలాంటి చాలెంజ్‌లు మన దేశంలో చేయడం మరింత ప్రమాదకరం. ఎందుకంటే ఫారిన్‌ రోడ్లతో పోల్చుకుంటే మన రోడ్లు నిత్యం రద్దీగానే ఉంటాయి. అందుకే ఇలాంటి చాలెంజ్‌లకు దూరంగా ఉండండి అని ముంబై పోలీసులు యువతను హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రమాదకర చాలెంజ్‌లకు దూరంగా ఉంటే మీ ప్రాణాలే కాక మీ తోటి వారి ప్రాణాలను కూడా కాపాడిన వారవుతారని ప్రచారం చేస్తున్నారు. ఎవరైనా ‘కికి చాలెంజ్‌’ పేరుతో రోడ్ల మీద విన్యాసాలు చేస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జనసమ్మర్ధం ఎక్కడెంత ?

లాక్‌డౌన్‌ కొనసాగింపు?

జ‌డ్జికి క‌రోనా రానూ: లాయ‌ర్ శాప‌నార్థం

గ్రెనేడ్ దాడిలో సీఆర్పీఎఫ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ మృతి

క్వారంటైన్ నుంచి పారిపోయిన క‌రోనా పేషంట్‌

సినిమా

పెద్దాయన సన్‌ గ్లాసెస్‌ వెతకండ్రా

రూ.1.25 కోట్ల విరాళం ప్ర‌క‌టించిన అజిత్‌

టిక్‌టాక్ వీడియోపై ర‌ష్మి ఆగ్ర‌హం

క‌రోనా : న‌టి టిక్‌టాక్ వీడియో వైర‌ల్‌

నటుడి కుటుంబానికి కరోనా.. ధైర్యం కోసం పోస్టు!

మాస్క్‌లు వ‌దిలేసి, చున్నీ క‌ట్టుకోండి: విజ‌య్