ఏ టవర్ నుంచి ఎంత రేడియేషన్?

24 Jun, 2014 17:23 IST|Sakshi
ఏ టవర్ నుంచి ఎంత రేడియేషన్?

మీ ఇంటికి సమీపంలో ఎక్కడైనా సెల్ఫోన్ టవర్ ఉందా? దాన్నుంచి ఎంత రేడియేషన్ వెలువడుతోందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే.. నేషనరల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ (ఈఎంఎఫ్) ఎమిషన్ సైట్లోకి వెళ్లి చూడండి. అందులో దేశంలో ఉన్న ప్రతి ఒక్క టవర్ నుంచి ఎంతెంత రేడియేషన్ వస్తోందో స్పష్టంగా ఉంటుంది. ప్రస్తుతానికి పరీక్షల చివరి దశలో ఉన్న ఈ పోర్టల్.. వచ్చే ఏడాది ప్రారంభం నాటికల్లా ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది.

సెల్ టవర్లు నిజంగానే సురక్షితంగా ఉన్నాయా, లేవా అన్న విషయాన్ని నిర్ధారించేందుకు టెలికం శాఖ, టెలికం పరిశ్రమ కూడా చాలారోజులుగా ఒక వెబ్సైట్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఇన్నాళ్లకు అది సాధ్యం అవుతోందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (కోయ్) డైరెక్టర్ జనరల్ రంజన్ ఎస్. మాథ్యూస్ తెలిపారు. రెండు నెలల్లో ఈ సైట్ టెస్టింగ్ పూర్తవుతుందని, పూర్తిస్థాయిలో ప్రారంభించేందుకు తొమ్మిది నెలల సమయం పడుతుందని ఆయన చెప్పారు. ముందుగా పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర రాష్ట్రాల్లో అమలుచేస్తామని, తర్వాత దేశం మొత్తంలోని టవర్ల సమాచారం ఇందులో ఉంటుందని అన్నారు. దీంతో టవర్ల గురించి ఉన్న అపోహలు తొలగిపోతాయని మాథ్యూస్ అన్నారు.

>
మరిన్ని వార్తలు