'మెడికల్ సీట్లు నష్టపోకుండా చర్యలు చేపట్టాలి' | Sakshi
Sakshi News home page

'మెడికల్ సీట్లు నష్టపోకుండా చర్యలు చేపట్టాలి'

Published Tue, Jun 24 2014 5:30 PM

ysr congress party appeal for stop medical seats reduce

హైదరాబాద్: మెడికల్ కాలేజీల్లో సీట్లు నష్ట పోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఎంసీఐ తీసుకున్న నిర్ణయంతో..అనేక మంది విద్యార్థులు నష్టపోతున్నారని అన్నారు. 1.10 లక్షల మంది విద్యార్థులు ఎంసెట్‌లో మెడిసిన్‌లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.

రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని మెడికల్ సీట్లు తగ్గకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మరో 350 మెడికల్ సీట్లు అదనంగా ఆంధ్రప్రదేశ్  వచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. రాష్ట్ర విభజనలో నేపథ్యంలో నూతన ఆంధ్రప్రదేశ్ లో 350 మెడికల్ సీట్లను భారతీయ వైద్యమండలి(ఎంసీఐ) రద్దు చేసింది. మౌలిక వసతులు కల్పించలేదని, రోగులకు తగిన పడకలు లేవని, తగిన సంఖ్యలో సిబ్బంది లేరన్న ప్రధాన కారణాలతో సీట్ల కోతపెట్టింది.
 

Advertisement
Advertisement