కుంభమేళా కోసం ప్రత్యేక మొబైల్‌ యాప్‌

7 Jan, 2019 04:08 IST|Sakshi

లక్నో: అలహాబాద్‌లో జనవరి 15 నుంచి జరగనున్న కుంభమేళా కోసం నార్త్‌ సెంట్రల్‌ రైల్వే(ఎన్‌సీఆర్‌) ప్రత్యేకంగా ’రైల్‌ కుంభ సేవా మొబైల్‌ యాప్‌’ ను ఆవిష్కరించింది. కుంభ మేళాలో పాల్గొనేందుకు అలహాబాద్‌ను సంద ర్శించే భక్తులు, పర్యాటకులు, ఇతర ప్రయా ణికులకు అవసరమైన సమాచారాన్ని అందించ డానికి ఈ యాప్‌ను రూపొందిం చినట్టు ఎన్‌సీఆర్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ అమిత్‌ మాల్వియ తెలిపారు. ఈ యాప్‌ కుంభమేళా ప్రత్యేక రైళ్లకు సంబంధించిన సమాచారం, రిజర్వ్‌ సీట్లు, రిజర్వు కాని సీట్ల వివరాలను తెలియజేస్తుందని ఆయన చెప్పారు.

ఏ సమ యంలోనైనా, ఎక్కడినుంచైనా కుంభమేళా కు సంబంధించిన సమాచారం ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. భక్తులు తమ ప్రస్తుత స్థానంతో పాటు, అలహాబాద్‌లోని అన్ని రైల్వేస్టేషన్లు, మేళా ప్రాంతం, ప్రధాన హోట ళ్ళు, బస్‌స్టేషన్లు, ఇతర సౌకర్యాలకు సంబం ధించిన సమాచారం కూడా ఈ యాప్‌ ద్వారా పొందొచ్చని చెప్పారు. పార్కింగ్, అల్పాహార గదులు, వేచి ఉండు గదుల సమాచారం కూడా ఈ యాప్‌ అందిస్తుందన్నారు.

మరిన్ని వార్తలు