అవును.. అది ఆవు మాంసమే!

1 Jun, 2016 08:40 IST|Sakshi
అవును.. అది ఆవు మాంసమే!

దేశంలో 'అసహనం' వ్యాఖ్యలకు దారితీసిన దాద్రి ఘటన గుర్తుండే ఉంటుంది కదూ. యూపీలోని దాద్రి ప్రాంతంలో 50 ఏళ్ల మహ్మద్ అఖ్లాక్‌ అనే వ్యక్తి వద్ద ఆవుమాంసం ఉందని సుమారు 100 మంది అతడిని ఇంట్లోంచి బయటకు లాగి చంపేశారు. అప్పట్లో పోలీసులు అతడి ఇంటివద్ద చెత్తకుండీలో ఉన్న మాంసం శాంపిళ్లను సేకరించారు. అది 'మటన్' అని, బీఫ్ కాదని స్థానిక వైద్యుడు ఒకరు చెప్పారు. కానీ.. ఆ ఘటన జరిగిన 8 నెలల తర్వాత ఈ కేసు సరికొత్త మలుపు తిరిగింది. అక్కడ లభించింది. ఆవు లేదా దూడ మాంసమేనని ఫోరెన్సిక్ పరీక్షలో వెల్లడైంది. తొలుత అది మటన్ అనే తాము భావించామని, కానీ తర్వాత అది ఆవుమాంసం అన్న విషయం తేలిందని యూపీ డీజీపీ జావేద్ అహ్మద్ తెలిపారు.

యూపీలో ఆవుమాంసం తినడం నేరం కాదు గానీ, ఆవులను చంపడం మాత్రం నేరమే. అఖ్లాక్ హత్య కేసులో అరెస్టయిన 18 మందిలో స్థానిక బీజేపీ నేత కుమారుడు కూడా ఉన్నారు. అప్పట్లో ముందు అక్కడున్నది మటన్ అని చెప్పడంతో.. బీజేపీ, దాని అనుబంధ సంఘాలు తప్పుడు రూమర్లు ప్రచారం చేస్తూ మత కల్లోలాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది.

మరిన్ని వార్తలు