ట్రెండ్‌ మార్చిన రజనీకాంత్‌

30 Nov, 2023 07:05 IST|Sakshi

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఇప్పుడు ట్రెండ్‌ మార్చారు అనిపిస్తుంది. 50 ఏళ్ల సినీ పయనం, 170 చిత్రాల అనుభవం. ఈయన తాజాగా నటించిన జైలర్‌ చిత్రం కూడా అనూహ్య విజయాన్ని సాధించింది. రజనీకాంత్‌ హీరోగా నటించిన ఇందులో కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌కుమార్‌, మలయాళం సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌, బాలీవుడ్‌ స్టార్‌ నటుడు జాకీష్రాఫ్‌ అతిథులుగా మెరిశారు. ఒక సూపర్‌స్టార్‌ చిత్రంలో ఇందరు స్టార్లు నటించడం నిజంగా విశేషమే. ఇలా ఈ చిత్రం నుంచే రజనీకాంత్‌ ట్రెండ్‌ మార్చినట్లు తెలుస్తోంది.

తాజాగా తన 171వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. జైలర్‌ చిత్రాన్ని నిర్మించిన సన్‌ పిక్చర్స్‌ సంస్థే ఈ చిత్రాన్ని నిర్మించనుంది. దీనికి దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈయన కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో షూటింగును ప్రారంభించనున్నట్లు దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ ఇటీవల ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. కాగా ఇందులో కూడా రజనీకాంత్‌తో పాటు యువ నటులు ముఖ్యపాత్రలు పోషించబోతున్నట్లు సమాచారం.

ముఖ్యంగా రాఘవ లారెన్స్‌ ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. తాజా సమాచారం ప్రకారం ఇందులో శివకార్తికేయన్‌ కూడా కీలక పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడ లేదన్నది గమనార్హం. ఇందులో మలయాళ భామ మంజువారియర్‌ రజనీకాంత్‌తో జతకట్టడానికి రెడీ అవుతున్నట్లు టాక్‌ స్ప్రెడ్‌ అవుతోంది. ఈ క్రేజీ భారీ చిత్రానికి అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు