లారీ వదిలి ఉల్లి ఎత్తుకుపోయారు!

29 Nov, 2019 04:48 IST|Sakshi

శివ్‌పురి: ఉల్లి లోడు లారీని ఎత్తుకుపోయిన దొంగలు.. రూ.22లక్షల విలువైన ఉల్లి గడ్డలను ఉంచుకుని లారీని వదిలేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి జిల్లాలో జరిగింది. ఈనెల 11వ తేదీన మహారాష్ట్రలోని నాసిక్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు 40 టన్నుల ఉల్లి గడ్డలతో ఓ లారీ బయలుదేరింది. ఆ లారీ ఈ నెల 22వ తేదీన గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉంది. అయితే, అది కనిపించకుండా పోవడంతో ఉల్లి వ్యాపారి ప్రేమ్‌చంద్‌ మధ్యప్రదేశ్‌ పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు టెండు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆ లారీ ఖాళీగా కనిపించింది. మధ్యప్రదేశ్‌లో కిలో ఉల్లి రూ.100 వరకు పలుకుతోంది.

సూరత్‌లో ఉల్లి దొంగలు
గుజరాత్‌: సూరత్‌లోని ఒక కూరగాయల దుకాణంలో రూ. 25 వేల విలువచేసే 250 కేజీల ఉల్లిని దొంగలు దోచేశారు. పాలన్పూర్‌ పటియాలోని దుకాణంలో ఈ చోరీ జరిగింది. ‘ఎప్పటిలాగే ఐదు 50 కేజీల బ్యాగులను బుధవారం రాత్రి అమ్మకానికి తీసుకొచ్చాం. గురువారం తెల్లవారుజామున దొంగలు ఐదు సంచీలను ఎత్తుకెళ్లారు’ అని దుకాణం ఉద్యోగి తెలిపారు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కుక్కల బోనులో బంధిస్తారు... చితకబాదుతారు!

వాళ్లను ఆదుకోండి: సోనియా

మందుబాబులకు బ్యాడ్‌న్యూస్‌.. హైకోర్టు స్టే

కరోనా: విదేశీ​ విరాళాలు కోరనున్న కేంద్రం!

ఆసుపత్రి నిర్లక్ష్యం: తల్లీబిడ్డలకు కరోనా

సినిమా

అయ్యో.. వారి పెళ్లి పెటాకులేనా?!

రానాతో కలిసి బాలకృష్ణ మల్టీస్టారర్‌ మూవీ!

కరోనా: ట్రెండింగ్‌లో ఆర్జీవీ ‘పురుగు’ పాట!

నా వంతు విరాళం సేకరిస్తున్నాను

బర్త్‌డేకి టైటిల్‌?

ఇంట్లోనే ఉందాం.... కరోనాను దేశం దాటిద్దాం