చరిత్ర సృష్టించిన ఇండిగో ఎయిర్‌లైన్స్

20 Nov, 2023 16:56 IST|Sakshi

విదేశాలకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. అందుకు తగినట్లు ఎయిర్ లైన్స్ సంస్థలు తమ ఫ్లైట్స్, రూట్ల సంఖ్యను పెంచుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగో రోజూ రెండు వేల విమానాలు నడిపి భారత విమానయాన రంగంలో చరిత్ర సృష్టించింది. 

రోజుకు రెండు వేలకు పైగా విమానాలు నడిపి ఇండిగో సంస్థ కొత్త మైలురాయిని చేరింది. దాంతో దేశంలో ఈ ఘనత సాధించిన మొదటి ఎయిర్‌లైన్‌గా నిలిచింది. అక్టోబర్ 2023కి సంబంధించిన ఓఏజీ డేటా ప్రకారం.. ఫ్రీక్వెన్సీ, సీట్ కెపాసిటీలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 10 ఎయిర్‌లైన్స్‌లో ఇండిగో చోటు దక్కించుకుంది.

'ఇండిగో ఇప్పుడు ప్రణాళికబద్ధంగా రోజు రెండు వేలకు పైగా విమానాలను నడుపుతోంది.  ఇందులో కార్గో ఆపరేషన్స్, సీఏపీఎఫ్‌, ఆర్మీ చార్టర్లు ఉన్నాయి. సంస్థ కార్యకలాపాలు ప్రారంభించిన 17 ఏళ్లలోనే ఈ ఘనత సాధించింది. ఆపరేషనల్ సామర్థ్యం,​​ విశ్వసనీయత, కస్టమర్ ఓరియంటేషన్‌లో కొత్త బెంచ్‌మార్క్‌లను క్రియేట్ చేసింది' అని ఎయిర్‌లైన్ సీఈఓ పీటర్ ఎల్బర్స్ పేర్కొన్నారు. ఇది కేవలం సంఖ్యాపరమైన ఘనతేకాదని, కనెక్టివిటీతో పాటు ప్రయాణికుల అనుభవాన్ని మరింత మెరుగుపరిచే అవకాశం కల్పించేదిగా భావిస్తున్నట్లు పీటర్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు