ఇకపై ఆక్స్‌ఫర్డ్‌ ఆన్‌లైన్‌ హిందీ డిక్షనరీ

21 Oct, 2016 10:47 IST|Sakshi

బెంగళూరు: హిందీ ఆన్‌లైన్‌ డిక్షనరీని అందుబాటులోకి తేనున్నట్లు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌ (ఓయూపీ) గురువారం తెలిపింది. ఆక్స్‌ఫర్డ్‌ గ్లోబల్‌ లాంగ్వేజెస్‌ (ఓజీఎల్‌) ప్రోగ్రామ్‌లో భాగంగా ఇప్పుడు ప్రారంభించనున్న హిందీ డిక్షనరీతో కలిపి మొత్తం తొమ్మిది భాషల్లో డిక్షనరీలను రూపొందించినట్లు ఓయూపీ తెలిపింది.

ఈ హిందీ సైట్‌ను ‘లాంగ్వేజ్‌ చాంపియన్‌’ తోడ్పాటుతో రూపొందిస్తున్నట్లు రాంచీ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పూనమ్‌ నిగామ్‌సహాయ్‌ తెలిపారు. ఓజీఎల్‌లో భాగంగా ప్రపంచంలోని 100 భాషల్లో డిక్షనరీలను అందుబాటులోకి తేవాలని ఓయూపీ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు.

>
మరిన్ని వార్తలు