ఆరో గది తెరిచే నిర్ణయం వారిదే!

13 Jul, 2020 12:17 IST|Sakshi

 తిరువనంతపురం: కేరళ అనంత పద్మనాభ స్వామి ఆలయం... చాలా కాలం వరకు అంతగా గుర్తింపు పొందని ఈ ఆలయం 2011లో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఆ గుడిలోని రహస్య  తలుపులను తెరవగా అందులో లక్షల కోట్ల విలువైన నిధి నిక్షేపాలు లభ్యమయ్యాయి. దీంతో ఈ గుడి ఒక్కసారిగా దేశంలోనే అత్యంత విలువైన గుడిగా మారిపోయింది. అయితే ఆ గుడిలో అన్నినేలమాలళిగలను తెరిచిన నిపుణులు ఒక నేలమాళిగను మాత్రం తెరవలేదు. ఆ గదిని తెరవాలని కొందరు, తెరవకూడదని మరికొందరు... ఇలా  ఎవరి నమ్మకాలకు అనుకూలంగా వారు వాదించారు. దానికి నాగబంధం ఉండటంతో అది తెరిస్తే ప్రళయం వస్తుందని కొందరు వాదిస్తున్నారు. 

చదవండి: ఇటాలియన్‌ మెరైన్స్‌‌ కేసు: కీలక పరిణామం

అయితే ఆ తలుపు తెరవాలా వద్దా అనేది ఎవరు నిర్ణయించాలో తెలియలేదు. ఎందుకంటే 1991 లో ట్రావెన్కోర్ చివరి పాలకుడు మరణించిన తరువాత రాజ కుటుంబ హక్కులు నిలిచిపోయాయని కేరళ హైకోర్టు 2011 లో తీర్పునిచ్చింది. ఆలయ నిర్వహణ బాధ్యతలను చూసుకునేందుకు ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని తెలిపింది. అదే విధంగా ఆరవ నేలమాళిగను తెరవాలని కూడా ఆదేశించింది. దీంతో ఆరవ నేలమాళిగలు తెరవడం ఇష్టం లేని ట్రావెన్‌కోర్‌ వంశీయులు ఆలయంపై హక్కులు తమకే ఉన్నయంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  9 సంవత్సరాల తరువాత ఈ ఉత్తర్వులను ​కొట్టిపడేస్తూ సుప్రీం తీర్పునిచ్చింది. చివరి పాలకుడి మరణం వల్ల కుటుంబ హక్కులు రద్దు చేయబడవని తెలిపింది. ఆలయ నిర్వహణ బాధ్యతలు ట్రావెన్ కోర్ రాజకుటుంబానికే చెందుతాయని తెలిపింది. దీంతో ఆరోగది తెరవాలా వద్దా అనేది విషయానికి సంబంధించి ట్రావెన్‌కోర్ ఫ్యామిలీ నిర్ణయం తీసుకోనుంది. 

చదవండి: శబరిమలలో భక్తులకు నో ఎంట్రీ

మరిన్ని వార్తలు