ఫేక్‌ వీడియోతో అడ్డంగా దొరికిపోయిన పాక్‌

6 Mar, 2019 11:01 IST|Sakshi

న్యూఢిల్లీ : పాకిస్తాన్‌ వక్రబుద్ధి మరోసారి బయటపడింది. అసత్య ఆరోపణలతో అడ్డంగా బుక్కైంది. ఓ పాత వీడియో తీసుకొచ్చి భారత్‌పై బురదజల్లేందుకు సిద్ధమైంది. భారత్‌కు చెందిన సబ్‌మెరైన్‌ తమ జలలాల్లోకి చొరబడేందుకు యత్నించిందని, ఆ ప్రయత్నాన్ని పాక్‌ నౌకాదళం దీటు తిప్పికొటి్ందని వెల్లడించింది. ‘భారత్‌ సబ్‌మెరైన్‌ను కనుకొన్న ఫుటేజ్‌ ఇదే’ అంటూ 50 సెకన్ల నిడివి గల ఓ వీడియో ఫుటేజీని పాక్‌ ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. భారత్‌పై అక్కసు వెళ్లగక్కిన పాక్‌ ప్రభుత్వానికి అక్కడి మీడియా వంత పాడింది. (వైరల్‌ : సర్జికల్‌ స్ట్రైక్స్‌-2 ఫేక్‌ వీడియో)

‘అవును, భారత సబ్‌మెరైన్‌ మా జలాల్లోకి రావడానికి యత్నించింది’ అంటూ పాక్‌ మీడియా బ్రేకింగ్‌లతో ఊదరగొట్టింది. సోషల్ మీడియాలో సైతం ఇదే తరహా ప్రచారం సాగింది. అయితే, ఇదంతా భారత్‌పై దష్ప్రచారం అని తేలింది. పాక్‌ ప్రభుత్వం, అక్కడి మీడియా చూపిస్తున్న వీడియో ఫుటేజీ పాతదని ఇండియా టుడే యాంటి ఫేక్‌ న్యూస్‌ వార్‌ రూమ్‌ (ఏఎఫ్‌డబ్ల్యూఏ) కనుగొంది. అసత్య ఆరోపణలు చేస్తున్న పాక్‌ వైఖరిపై భారత్‌ తీవ్రంగా మండిపడింది. ఈ ఫేక్‌ వీడియో ఫుటేజీని పాక్‌ ప్రభుత్వం విడుదల చేసే ముందే మీడియాలో ప్రత్యక్షమవడం గమనార్హం. (సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఫేక్‌ వీడియో)

అది 2016 వీడియో..
2016కు చెందిన వీడియోపై తాజా తేదీ, సమయం అంటించి పాక్‌ గగ్గోలు పెడుతోందని ఇండియా టుడే ఏఎఫ్‌డబ్ల్యూఏ స్పష్టం చేసింది. డాష్‌వేర్‌ అనే సాఫ్ట్‌వేర్‌తో ఈ ఫేక్‌ వీడియో గుట్టు రట్టు చేశామని వెల్లడించింది. కాగా, 2016లో సైతం ఇదే వీడియో చూపెట్టిన పాక్‌ భారత్‌పై నిందలు మోపింది. తమ జలాల్లోకి భారత సబ్‌మెరైన్‌ దూసుకొచ్చేందుకు యత్నించిందని ఆరోపించింది. ఆ ఆరోపణలను భారత్‌ ఖండించింది. 

మరిన్ని వార్తలు