పెట్రో వాత : ఎంత పెరిగింది?

15 Jun, 2020 08:25 IST|Sakshi

వరుసగా 9వ రోజూ పెరిగిన ధరలు

గత తొమ్మిది రోజుల్లో పెట్రోల్  సుమారు రూ .5  పెంపు

డీజిల్ లీటరుకు రూ .5.23 పెంపు

సాక్షి, న్యూఢిల్లీ : పెట్రో ధరల సెగ కొనసాగుతోంది. వరుసగా తొమ్మిదవ రోజు కూడా పెట్రోల్, డీజిల్‌  ధరలు సోమవారం మరింత భగ్గుమన్నాయి. డీజిల్‌ ధర లీటరుకు 59 పైసలు , పెట్రోల్‌ 46 పైసలు  చొప్పున పెరిగాయి. గత తొమ్మిది రోజుల్లో పెట్రోల్ ధరల లీటరుకు రూ. 5, డీజిల్ లీటరుకు రూ .5.23 పెరిగింది. ముడి చమురు రేట్లు క్షీణిస్తున్నప్పటీకి, దేశీయంగా ఇంధర ధరలు రికార్డు స్థాయికి చేరాయి.

ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిలు ధరలు లీటరుకు 
న్యూఢిల్లీ : పెట్రోలు ధర  రూ. 76.26, డీజిల్  రూ.74.62
ముంబై :  పెట్రోలు ధర  రూ. 83.17, డీజిల్  రూ.73.21
చెన్నై: పెట్రోలు ధర  రూ. 79.96, డీజిల్  రూ.72.69

హైదరాబాద్ : పెట్రోలు ధర  రూ.79.17, డీజిల్  రూ.72.93
అమరావతి : పెట్రోలు ధర  రూ. 79.64, డీజిల్  రూ.73.44

మరిన్ని వార్తలు