మరో గుడ్‌ న్యూస్‌: భారీగా తగ్గిన గ్యాస్‌ ధర

1 Sep, 2023 12:18 IST|Sakshi

Commercial LPG cylinder price cut కమర్షియల్‌ సిలిండర్ ధరలను తగ్గించిన కేంద్రం ఇప్పుడు మరో శుభవార్త అందించింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు)కీలక నిర్ణయం తీసుకున్నాయి. కేంద్రం వంటగ్యాస్‌ డొమెస్టిక్‌ సిలిండర్ల ధరలను భారీగా తగ్గించిన నేపథ్యంలో కమర్షియల్‌ సిలిండర్లను  తగ్గించాయి.కొత్త ధరలు నేటి నుండి అమలులో ఉంటాయి. (పాక్‌ ఆర్థిక సంక్షోభం: రూ. 300 దాటేసిన పెట్రోలు)

అనేక రాష్ట్రాల్లో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ల ధరను సుమారు రూ.158 తగ్గించాయి. తాజా తగ్గింపుతో  ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ రిటైల్ విక్రయ ధర రూ. 1,522.50 అవుతుంది. అదే విధంగా ముంబైలో గతంలో రూ.1640.50 ఉండగా ఇప్పుడు రూ.1482గా ఉందినుంది. అలాగే చెన్నైలో రూ.1852.50కి బదులుగా రూ.1695కే అందించనున్నారు. వాణిజ్య, గృహ LPG (ద్రవీకృత పెట్రోలియం గ్యాస్) సిలిండర్ల ధరలను ప్రతి నెల మొదటి రోజున సమీక్షిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది  జూలైలో 7 రూపాయలు పెరిగిన  వాణిజ్య LPG సిలిండర్ల ధర ఆగస్టులో రూ. 99.75  మేర తగ్గిన సంగతి తెలిసిందే. ( LPG Price Cut: మహిళలకు రూ. వేల కోట్ల రక్షాబంధన్‌ గిఫ్ట్‌)

కాగా రక్షా బంధన్ సందర్భంగా, దేశంలోని మహిళలకు బహుమతిగా కేంద్ర ప్రభుత్వం దేశీయ ఎల్‌పిజి ధరను రూ.200 తగ్గించింది. అలాగే ఉజ్వల స్కీమ్ కింద అందించే రూ.200  సబ్సిడీకి అదనంగా  రూ.200తో మొత్తంగా  రూ. 400 తక్కువకే సిలిండర్‌ లభిస్తోంది.

మరిన్ని వార్తలు