వాహనదారులకు పెట్రో షాక్‌

5 Jul, 2019 13:44 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌లో వాహనదారులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పెట్రోల్‌ ధరలు ఇప్పటికే పరుగులు పెడుతుండగా బడ్జెట్‌లో ఇంధన ధరలపై సెస్‌ విధించడంతో ఇవి మరింత భారం కానున్నాయి. ప్రతి లీటర్‌పై రూ 1 అదనంగా బడ్జెట్‌లో సెస్‌ విధించారు.

అదనపు సెస్‌తో పెట్రో ధరలు సామాన్యుడికి సెగలు పుట్టించనున్నాయి. మరోవైపు పెట్రో సెస్‌ ద్వారా కేంద్రానికి రోజూ దాదాపు రూ 200 కోట్ల రాబడి సమకూరుతుందని అంచనా. పెట్రో ధరలు పెరగడంతో సరుకు రవాణా ఛార్జీలు భారమై నిత్యావసరాల ధరలూ ఎగబాకే అవకాశం ఉంది.

>
మరిన్ని వార్తలు