ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి రూ 76,800 కోట్లు

1 Feb, 2019 13:05 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మధ్యంతర బడ్జెట్‌ను ఎన్నికల సన్నాహక బడ్జెట్‌గా కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ బడ్జెట్‌లో ప్రణాళిక వ్యయం రూ 3.36 లక్షల కోట్లుగా పేర్కొన్న ఆర్థిక మంత్రి  పీయూష్‌ గోయల్‌ ప్రభుత్వం వ్యయం 13.3 లక్షల కోట్లకు పెరిగిందని వెల్లడించారు. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ సంక్షేమానికీ ప్రాధాన్యత కల్పించిన ప్రభుత్వం ఈ రంగానికి రూ 76.800 కోట్ల కేటాయింపులు జరిపింది.

పన్ను మినహాయింపులతో పట్టణ ప్రాంత ప్రజలను, వేతన జీవులను ఆకట్టుకున్న ప్రభుత్వం గ్రామీణ రంగంలో రైతులకు ఊరట ఇచ్చేలా నగదు సాయం పథకం ప్రకటించింది. ఇక ఎస్సీ, ఎస్టీ సంక్షేమం కోసం రూ 76,800 కోట్లను బడ్జెట్‌లో కేటాయించిన మోదీ సర్కార్‌ దళితులను అత్యంత వెనుకబడిన వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

మరిన్ని వార్తలు