సాధ్వి వ్యాఖ్యలపై మోదీ ఫైర్‌

17 May, 2019 15:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తుదివిడత పోలింగ్‌కు ముందు పార్టీ భోపాల్‌ లోక్‌సభ అభ్యర్ధి సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నష్టనివారణ చర్యలు చేపట్టింది. గాడ్సేను సమర్ధిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పార్టీ చీఫ్‌ అమిత్‌ షా పార్టీ వైఖరిని స్పష్టం చేశారు. ఆమె వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం లేదని, ఆమెను పార్టీ వివరణ కోరుతుందని చెప్పారు.

మరోవైపు గాడ్సేను దేశభక్తుడిగా సాధ్వీ ప్రజ్ఞా సింగ్‌ అభివర్ణించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీని అవమానించేలా మాట్లాడిన సాధ్విని ఎన్నటికీ క్షమించమని ఆయన వ్యాఖ్యానించారు. కాగా మహాత్మ గాంధీని చంపిన నాథూరాం గాడ్సే ఎప్పటికీ దేశభక్తుడేనని సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలను విపక్ష కాంగ్రెస్‌ సహా పలువురు బీజేపీ నేతలు సైతం తప్పుపట్టారు.

మరిన్ని వార్తలు