మోదీ మొకాలిపై కూర్చొని మట్టిని తాకి భావోద్వేగం

8 Oct, 2017 15:11 IST|Sakshi

వాద్‌ నగర్‌/ గుజరాత్‌ : ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం భావోద్వేగానికి లోనయ్యారు. తాను చిన్నప్పుడు చదువుకున్న పాఠశాలకు స్వయంగా నడుచుకుంటూ వెళ్లి మొకాలిపై కూర్చుని స్కూల్లోని మట్టిని తాకారు. తాను ఈరోజు ఇన్ని విలువలతో బతుకుతున్నానంటే ఆ పాఠాలు ఈ నేల నుంచే నేర్చుకున్నానంటూ పేర్కొన్నారు. 2014 తర్వాత తొలిసారి ప్రధాని హోదాలో తన స్వగ్రామం వాదనగర్‌ వెళ్లిన మోదీ దారి పొడవునా భారీ నీరాజనాలు అందుకున్నారు. తమ మధ్య తిరిగిన బిడ్డ ప్రధానిగా తమ గ్రామానికి రావడంతో అంతా ఘన స్వాగతం పలికారు.

బరేలీలోని ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభానికి వచ్చిన సందర్భంగా తన గ్రామంలో అడుగుపెట్టారు. భద్రతా సిబ్బంది అక్కడే ఉండమని చెప్పి తన ఎస్‌యూవీ వాహనంలో నుంచి బయటకు దిగి నేరుగా స్కూల్‌కి నడుచుకుంటూ వెళ్లారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలకరించారు. 'నేను నా ప్రయాణాన్ని వాద్‌ నగర్‌ నుంచి ప్రారంభించాను. ఇప్పుడు వారణాసి చేరుకున్నాను. వాదనగర్‌, వారణాసి రెండూ కూడా పవిత్ర శివుడి ప్రాంతాలే. ఈ శివుడు నాకు తిరుగులేని శక్తినిచ్చాడు. ఈ మట్టి నుంచి నేను అందుకున్న అతిపెద్ద బహుబతి ఇదే' అని అన్నారు. మరోసారి వారు అందించిన దీవెనలతో తిరిగెళ్లి దేశం కోసం మరింత శ్రమిస్తానంటూ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు