ఆ రాష్ట్రంలో ప్రారంభమైన తొలి ఎయిర్‌పోర్ట్‌

24 Sep, 2018 11:55 IST|Sakshi
సిక్కింలో ప్రారంభమైన తొలి ఎయిర్‌పోర్గ్‌

గ్యాంగ్‌టక్‌ :  సిక్కిం తొలి ఎయిర్‌పోర్ట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. గ్యాంగ్‌టక్‌కు 33 కిలోమీటర్ల దూరంలోని పయోంగ్‌ వద్ద 2009లో శంకుస్ధాపన జరిగిన ఎయిర్‌పోర్ట్‌ను ప్రధాని లాంఛనంగా ప్రారంభించారు. గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌గా దీన్నిఅభివృద్ధి చేశారు. 

ఆదివారం సాయంత్రం ఎంఐ-8 విమానంలో ఇక్కడికి చేరుకున్న ప్రధానికి గవర్నర్‌ గంగా ప్రసాద్‌, సీఎం పవన్‌ చామ్లింగ్‌ తదితరులు లివింగ్‌ ఆర్మీ హెలిపాడ్‌లో స్వాగతం పలికారు. సైనికుల గౌరవ వందనం స్వీకరించిన ప్రధాని రాజ్‌భవన్‌లో బస చేశారు. ఈశాన్య రాష్ట్రాల ప్రయాణీకులకు మిగిలిన ప్రపంచంతో కనెక్టివిటీ  పెరిగేందుకు ఈ విమానాశ్రయం ఉపకరిస్తుందని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు