‘రఫేల్‌ డీల్‌కు మిషెల్‌ అడ్డుపడ్డారు’

9 Jan, 2019 17:57 IST|Sakshi

ముంబై : రఫేల్‌ ఒప్పందంలో కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. రఫేల్‌ను వ్యతిరేకిస్తూ అగస్టా స్కాంలో దళారి క్రిస్టియన్‌ మిషెల్‌ లాబీయింగ్‌ చేశారనే వార్తల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీని నిలదీశారు. మహారాష్ట్రలోని షోలాపూర్‌లో బుధవారం జరిగిన ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ అగస్టా సూత్రధారి మిషెల్‌ను తాము భారత్‌కు రప్పించిన తర్వాత పలు అంశాలు బయటికొస్తున్నాయని, రఫేల్‌కు వ్యతిరేకంగా మిషెల్‌ మరో డీల్‌ ప్రతిపాదించారనే వార్తలపై కాంగ్రెస్‌ వివరణ ఇవ్వాలన్నారు.

రఫేల్‌కు బదులుగా యూరోఫైటర్‌కు ఈ ఆర్డర్‌ను కట్టబెట్టేందుకు అగస్టా ఒప్పందంలో ముడుపులు స్వీకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మిషెల్‌ ప్రయత్నించారని ఇండియా టుడే కొన్ని పత్రాలను బయటపెట్టిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు