విచారణకు కోల్‌కతా మాజీ చీఫ్‌ డుమ్మా

28 May, 2019 03:22 IST|Sakshi

కోల్‌కతా: శారదా చిట్‌ఫండ్‌ కుంభకోణం కేసులో కోల్‌కతా మాజీ పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ సోమవారం సీబీఐ ఎదుట విచారణకు గైర్హాజరయ్యారు. తాను మూడు రోజులపాటు సెలవులో ఉన్నానని, వ్యక్తిగత కారణాల వల్ల వారం రోజుల వరకు హాజరు కాలేనని రాజీవ్‌ కుమార్‌ సీబీఐకి రాసిన లేఖను.. ఓ సీఐడీ అధికారి ఇక్కడి సాల్ట్‌ లేక్‌లోని సీబీఐ కార్యాలయంలో అందజేశారు. పలుమార్లు రాజీ వ్‌కు కాల్‌ చేసినా ఆయన వైపు నుంచి స్పందన లేదని  సీబీఐ అధికారి ఒకరు  చెప్పారు. అయినా వెనక్కి తగ్గకుండా కోల్‌కతాలోని రాజీవ్‌ అధికారిక నివాసానికి సీబీఐ అధికారుల బృందం వెళ్లగా ఆయన నివాసంలో లేరు. శనివారం రాజీవ్‌ దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్‌ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.    

మరిన్ని వార్తలు