‘రవి మోహన్‌ సైనీ’ గుర్తున్నాడా?

29 May, 2020 16:01 IST|Sakshi

జైపూర్‌: 19 ఏళ్ల క్రితం రాజస్తాన్‌ అల్వార్‌కు చెందిన రవి మోహన్ సైనీ అనే 14 ఏళ్ల కుర్రాడి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. హిందీలో బాగా ప్రసిద్ధి చెందిన ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’(కేబీసీ) షోలో మొత్తం 15 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి.. ప్రైజ్‌ మనీ రూ. కోటి సొంతం చేసుకున్నాడు. ఆ కుర్రాడు ప్రస్తుతం పోర్బందర్‌లో పోలీసు సూపరింటెండెంట్(ఎసస్పీ)‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రవి పదో తరగతి చదువుతుండగా ‘కేబీసీ జూనియర్‌’ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌గా ఉన్న ఈ షోలో మొత్తం 15 ప్రశ్నలకు సమాధానం చెప్పి ప్రైజ్‌ మనీ రూ.కోటి గెలుచుకుని ఎందరికో ఆదర్శంగా నిలిచాడు రవి. ఓ ఆంగ్ల మీడియా సంస్థ 2017లో అతడిని  ఇంటర్వ్యూ చేసింది.(అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం

ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ ‘‘కేబీసీ’లో గెలిచిన నాలుగేళ్ల తర్వాత నాకు ప్రైజ్‌ మనీ అందింది. షో నియమం ప్రకారం 18 ఏళ్లు నిండిన తర్వాతే డబ్బు ఇచ్చారు. ట్యాక్స్‌ పోను ప్రైజ్‌ మనీ రూ.కోటిలో 69 లక్షల రూపాయలు నాకు దక్కాయి’ అని తెలిపాడు. తండ్రిని ఆదర్శంగా తీసుకున్న రవి.. పోలీసు డిపార్ట్‌మెంట్‌లో చేరాలనుకున్నాడు. ఈ మేరకు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్(యూపీఎస్సీ)‌ పరీక్షలకు హాజరయ్యాడు. అనేక ప్రయత్నాల తర్వాత 2014లో కోరుకున్న ఉద్యోగంలో చేరాడు. ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌కు సెలక్టయిన రవి గుజరాత్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. రాజ్‌కోట్‌లో డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్న ఆయనకు మూడు రోజుల క్రితం పోర్బందర్ బాధ్యతలు అప్పగించారు.(రాధిక శరత్‌కుమార్‌ సరికొత్త అవతారం..)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా