‘రాహుల్‌ పాకిస్తాన్‌నే నమ్ముతారు’

7 Mar, 2019 11:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్‌ ఒప్పందంలో ప్రధాని నరేంద్ర మోదీని విచారించాలని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ డిమాండ్‌పై కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత రవిశంకర్‌ ప్రసాద్‌ తీవ్రంగా స్పందించారు. రాహుల్‌ అవాస్తవాలను ప్రచారంలో పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. భారత వాయుసేనపై రాహుల్‌కు విశ్వాసం లేదని, ఆయన సుప్రీం కోర్టు, కాగ్‌ను కూడా నమ్మరని..మరి పాకిస్తాన్‌ను మాత్రమే రాహుల్‌ విశ్వసిస్తారా అని కేంద్ర మంత్రి నిలదీశారు.

రఫేల్‌ పోటీదారులకు అనుకూలంగా రాహుల్‌ ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారని సందేహం వ్యక్తం చేశారు. కాగా రఫేల్‌ ఒప్పందంలో ప్రధాని మోదీపై రాహుల్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రఫేల్‌ ఒప్పందం పత్రాలు గల్లంతయ్యాయని మీడియాపై మోదీ సర్కార్‌ ఆరోపణలు గుప్పిస్తోందని, రూ 30,000 కోట్ల రఫేల్‌ ఒప్పందంలో ప్రమేయం కలిగిన వారిపై మాత్రం విచారణ చేపట్టడం లేదని రాహుల్‌ మండిపడ్డారు. ప్రధాని మోదీ సహా ఈ ఒప్పందంలో భాగమైన వారందరినీ విచారించాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు