అందరూ చూస్తుండగా అధికారి చెంపచెళ్లు

10 Mar, 2017 09:15 IST|Sakshi
అందరూ చూస్తుండగా అధికారి చెంపచెళ్లు

న్యూఢిల్లీ: ఓ నావికుడు సర్వే షిప్‌ అధికారిపై చేయిచేసుకున్నాడు. ఆయన చెప్పిన ఆదేశాలు పాటించలేదని మందలిస్తుండగా నేరుగా చెంపచెల్లుమనిపించాడు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు సహాయక నావికులను విధుల నుంచి తొలగించారు. ఈ ఘటన ఒడిశాలోని పారాద్వీప్‌ పోర్ట్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఐఎన్‌ఎస్‌ సందాయక్‌ అనే నౌక సర్వే షిప్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఇందులో షిప్‌ బోర్డుకు అధికారిగా పనిచేస్తున్న ఆయన నౌకలోని మోటారు బోట్లను లాగేందుకు పనిచెప్పారు. ఈ విషయంలో నలుగురు సహాయక నావికులు కాస్త అసంబద్ధంగా ప్రవర్తించారు. పై అధికారి మాటలు లెక్కచేయలేదు.

ఎదురు తిరిగేందుకు ప్రయత్నించారు. వీరిలో ఒకరు మాత్రం నేరుగా అధికారిపై చేయిచేసుకున్నాడు. దాదాపు దీనిని తిరుగుబాటు అని అనుకోవచ్చని సంబంధిత అధికారులు చెప్పారు. భారతీయ నానికా దళం అంటేనే క్రమశిక్షణకు పేరని, వారిని అలాగే క్షమించి వదిలేస్తే మిగితా వారికి తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లువుతుందనే ఉద్దేశంతో వారు నలుగురుపై వేటు వేసినట్లు తెలిపారు. ఐఎన్‌ఎస్‌ సందాయక్‌ను 2001లో ఈస్ట్రన్‌ నావల్‌ కమాండ్‌ ప్రారంభించింది. ఇది పూర్తిగా స్వదేశీ తయారీ నౌక. సముద్ర తీర ప్రాంతంలో ఉన్న సముద్ర సంపదను గుర్తించడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది.

మరిన్ని వార్తలు