‘మహా’ సర్కారులోకి శివసేన!

23 Nov, 2014 01:08 IST|Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వంలో శివసేన చేరికకు మార్గం సుగమం అవుతోంది. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో శివసేనను కూడా చేర్చుకోవాలని బీజేపీ అధిష్టానం  నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ శనివారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశమై ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. మంత్రి వర్గ విస్తరణకు ఈ సందర్భంగా ఆమోదం లభించినట్లు సమాచారం. డిసెంబర్ 8 నుంచి జరగనున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోపు జరిగే విస్తరణలో శివసేనకు కూడా అవకాశం ఇవ్వనున్నట్లు మహారాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రి శనివారం చెప్పడం తాజా పరిణామాలను సూచిస్తోంది. విస్తరణ  ఈ నెల 25 నుంచి 30 మధ్య ఉంటుందన్నారు.
 
స్నేహం కొనసాగుతుంది: ఫడ్నవిస్
శివసేనతో త్వరలోనే ఓ అంగీకారానికి వస్తామని ఫడ్నవిస్ ఆశాభావం వ్యక్తం చేశారు. శివసేన ఎప్పటికీ బీజేపీ మిత్రపక్షమేనని, భవిష్యత్తులోనూ ఇది కొనసాగుతుందని హిందూస్థాన్ టైమ్స్ ఢిల్లీలో నిర్వహించిన నాయకత్వ సదస్సులోపేర్కొన్నారు. శివసేనతో చర్చలు సరైన దిశలో నడుస్తున్నాయని చెప్పారు.

మరిన్ని వార్తలు