మన దేశం చెత్తగా ఉండాలా?

25 May, 2015 17:48 IST|Sakshi
మన దేశం చెత్తగా ఉండాలా?

మన దేశం శుభ్రంగా ఉండాలా.. చెత్తగా ఉండాలా మీరే చెప్పండి అని ప్రధాని నరేంద్రమోదీ మథుర వాసులను ప్రశ్నించారు. తన ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన సందర్భంగా మథురలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన స్వచ్ఛభారత్ కార్యక్రమం గురించి విశేషంగా చెప్పారు. ఆయనేమన్నారంటే..

  • మన దేశం శుభ్రంగా ఉండాలా.. చెత్తగా ఉండాలా?
  • ఇంటి చుట్టూ చెత్త ఉండటం వల్లే రోగాలు వస్తాయి.
  • దాంతో పిల్లాడు చనిపోతే.. కుటుంబం మొత్తం బాధపడుతుంది
  • ప్రతియేటా ఒక్కో కుటుంబానికి చెత్త వల్ల 7వేలరూపాయల వైద్యఖర్చులు అవుతున్నాయని ప్రపంచబ్యాంకు చెప్పింది
  • అందుకే మనం చెత్తను మన పరిసరాల నుంచి దూరం చేయాలి.
  • 125 కోట్ల మంది దేశవాసులు ఈ ప్రతిజ్ఞ చేయాలి
  • ఈ పని కష్టమే గానీ, ప్రతి ఒక్కరూ చేయాలి.
  • మన భారతమాత చెత్తమయం అయిపోకూడదు.
  • మన గంగామాత, యమునా మాత చెత్తతో నిండిపోకూడదు
  • ఈ పనులన్నీ చేయడానికే వచ్చాం.. చేసి తీరుతాం. అందుకు మీ సహకారం కావాలి, మీ ఆశీస్సులు కావాలి.
  • మా ఆశీస్సులు ఉంటే అన్ని పనులూ చేస్తాం.
  • పేదలకు నివసించడానికి పక్కా ఇళ్లు కావాలా.. వద్దా?
  • వాటిలో కరెంటు, సెప్టిక్ లెట్రిన్లు ఉండాలా.. అక్కర్లేదా?
  • రాబోయే ఏడేళ్లలో ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఇలాంటి సౌకర్యాలతో కూడిన సొంత ఇల్లు ఉండాలని సంకల్పం పెట్టుకున్నాను.

మరిన్ని వార్తలు