డాన్సర్ సితారా దేవి మృతి

25 Nov, 2014 10:21 IST|Sakshi
డాన్సర్ సితారా దేవి మృతి

ముంబై: ప్రముఖ కథక్ నృత్య కళాకారణి సితారా దేవి మంగళవారం ముంబైలోని జస్లోక్ ఆస్పత్రిలో మరణించారు. ఆమె వయస్సు 94 ఏళ్లు. గత కొంత కాలంగా ఆమె అనార్యోగంతో బాధపడుతున్నారు. సోమవారం సితార తీవ్ర ఆరోగ్యానికి గురైయ్యారు. దీంతో ఆమెను కుంబాల హిల్స్ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో... జస్లోక్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సితారా దేవి ఈ రోజు తెల్లవారుజామున మరణించారని ఆమె అల్లుడు రాజేశ్ మిశ్రా వెల్లడించారు.

సితారాదేవికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కథక్ నృత్యానికి ఆమె అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అలాగే సంగీత నాటక అకాడమీ, కాళీదాసు సన్మాన్ అవార్డులు సితారాదేవి అందుకున్నారు. కొల్కత్తాలోని పురాణ ప్రవచనం చేసే ప్రముఖ పండితులు సుఖదేవ్ మహారాజ్ ఇంట 1920లో సితారాదేవి జన్మించారు. సితారాదేవి మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. కథక్ నృత్యానికి ఆమె అందించిన సేవలను మోడీ ఈ సందర్బంగా కొనియాడారు.

మరిన్ని వార్తలు