ఏళ్లుగా సాగుతున్న 'పరంపర" సంప్రదాయానికే కట్టుబడిన రాజస్థాన్‌! సీఎం ఎవరంటే..?

3 Dec, 2023 13:52 IST|Sakshi

రాజస్థాన్‌ ఎన్నికల పరంగా సాగుతున్న సంప్రదాయాన్ని మార్చి చరిత్ర తిరగరాయాలనుకున్న కాంగ్రెస్‌ మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయింది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ అనూహ్యంగా ఆధిక్యం చూపింది. కాంగ్రెస్‌ నమ్ముకున్న గ్యారంటీ హామీ గేమ్‌ కంటే బీజేపీ స్ట్రాటజీనే గెలించిందన్నట్లుగా ఓట్ల ఆధిక్యం చూపిస్తోంది. రాజస్థాన్‌ కాంగ్రెస్‌ సాగించిన పాలనపై విమర్శలు కురిపిస్తూ అవి ప్రజల్లోకి వెళ్లే దిశగా చేసిన ప్రచార స్ట్రాటజీ ఫలించింది.

ఇక ఓట్ల లెక్కింపులో మధ్యాహ్నాం 1.00 గంట

బీజేపీ  కాంగ్రెస్‌  ఇతరులు

111         72         02

దీంతో బీజేపీ కార్యాలయాల్లో 'మోదీ'..'మోదీ' అంటూ నినాదాలు మిన్నంటాయి. ఈ ఎన్నికల్లో మహిళల అంశమే కీలకపాత్ర పోషించదని అన్నారు ముఖ్యమంత్రి అభ్యర్థి దియా కుమారి అన్నారు. బీజేపీ రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారంలో మహిళలకే పెద్ద పీఠం వేస్తూ.. లడో ప్రోత్సాహన్ యోజన కింద ఆడపిల్ల పుట్టినప్పుడు రూ. 2 లక్షల పొదుపు బాండ్, లక్షపతి దీదీ పథకం కింద దాదాపు ఆరు లక్షల మంది గ్రామీణ మహిళలకు నైపుణ్య శిక్షణ, 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన ప్రతిభావంతులైన బాలికలకు స్కూటర్లు, కేజీ నుంచి ఉచిత విద్య కల్పిస్తామని కూడా బీజేపీ వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే.

ముఖ్యమంత్రి ఎవరంటే..?
ఇక బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు అధిష్టానం నిర్ణయానికే వదిలేశామని చెప్పారు. కాగా, రాజస్తాన్‌లో మూడు దశాబ్దాలుగా ఒకసారి కాంగ్రెస్‌ మరోసారి బీజేపీ అంటూనే సాగినప్పటికీ 2018లో ఏ పార్టీకి మెజారిటీ రాకుండా ఆశ్చర్యపరిచింది. దాదాపు 200 మంది సభ్యులుండే సభలో 101 మందికి ఒక్కటి తక్కువ ఉన్న కాంగ్రెస్, మాయావతి బహుజన్ సమాజ్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

(చదవండి: రాజస్థాన్‌ ఎన్నికల కౌంటింగ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌)


 

మరిన్ని వార్తలు