'అదంతా లెఫ్ట్-లిక్కర్ లాబీ కుట్ర'

4 Feb, 2016 09:39 IST|Sakshi
'అదంతా లెఫ్ట్-లిక్కర్ లాబీ కుట్ర'

తిరువనంతపురం: సోలార్ స్కామ్.. వామపక్ష కూటమి, లిక్కర్ లాబీ కుట్ర అని కేరళ ముఖ్యమంత్రి ఊమన్ చాందీ అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి యూడీఎఫ్ విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తనను పదవి నుంచి దించేందుకు లిక్కర్ లాబీ ప్రయత్నిస్తోందని ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాందీ ఆరోపించారు. బెదిరింపులకు భయపడబోనని ఆయన స్పష్టం చేశారు.

సోలార్ స్కామ్ లో లంచం తీసుకున్నారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని తనను ఎవరూ ఒత్తిడి చేయాలని లేదని తెలిపారు. ఈ అంశం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉందని, నిష్పక్షపాతంగా విచారణ జరుగుతోందని చెప్పారు. సోలార్ స్కామ్ లో తనపై చేసిన ఆరోపణలు నిరాధారం, అసత్యమని అన్నారు.

కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి పాలనలో రాష్ట్రం పతనమైందని లెఫ్ట్ చేసిన ఆరోపణలు అర్థరహితమని కొట్టిపారేశారు. గత ఐదేళ్లలో తాము ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేశామని, మళ్లీ అధికారం నిలబెట్టుకుంటామని ఊమెన్ చాందీ దీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు