నా పిల్లల కోసమే...షారుఖ్

27 Aug, 2014 22:33 IST|Sakshi
నా పిల్లల కోసమే...షారుఖ్

ముంబై: త్వరలో విడుదల కానున్న ‘హ్యేపీ న్యూ ఇయర్’ సినిమాలో స్టంట్లు, సాహస విన్యాసాలు కేవలం తన పిల్లలు సుహానా, ఆర్యన్ కోసమే చేశానని బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్‌ఖాన్ చెప్పాడు. ‘నాకు ఇద్దరు పిల్లలు. స్టంట్లు చేయాలని వారు చెప్పారు. భార్య గౌరి కంటే కూడా ఎక్కువగా వారి మాటే వింటాను.

 సవాలు లాంటి వాటిని కనుక చేయలేకపోతే వాటి గాయాలకు భయపడిపోృుునట్టు నాకు అనిపిస్తుంది’ అని అన్నాడు. 48 ఏళ్ల షారుఖ్ ‘హ్యేపీ న్యూ ఇయర్’ సినిమా షూటింగ్ సమయంలో గాయపడ్డాడు. భుజం తదితర చోట్ల ఏర్పడిన గాయాలవల్ల ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు మరింత బలీయంగా తయారయ్యా. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఓ నటుడిగా శారీరకంగా, మానసికంగా బలంగా ఉండగలగాలి. నేను చేయగలిగినమేరకు చేస్తా. భవనంపై నుంచి కిందికి దూకా. ఎంతో భయమనిపించింది. ఓ తాడు పట్టుకుని దూకాల్సి ఉంటుంది. అందువల్ల సురక్షితమే. ఓ సూపర్‌స్టార్ కెమెరా ముందు ఏవిధంగా నటిస్తాడనే విషయం తెలుసుకోవాలనేది అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది.

అయితే వారి పిల్లలు మాత్రం అటువంటివి చేయాలని కోరుకోరు షూటింగ్‌లు చూసిచూసి వారు విసిగిపోతారు. అందువల్ల వారు అంత ఎక్కువగా షూటింగ్ స్పాట్‌కు రావడానికి ఇష్టపడరు. ముంబైలో షూటింగ్ జరుగుతుంటే మాత్రం మా పిల్లలు రారు. షూటింగ్‌ను వారు ద్వేషిస్తారు. ఇక విదేశాల్లో షూటింగ్ ఉంటే రావాలని వారికి అనిపించినా విద్యాభ్యాసం కారణంగా అప్పుడప్పుడూ వస్తుంటారు’ అని అన్నాడు. కాగా వృత్తిపరంగా నిరంతరం తీరిక లేకుండా గడిపే షారుఖ్‌ఖాన్ ఆ కారణంగా ఎక్కువ రోజులు కుటుంబానికి దూరంగానే ఉండాల్సి వస్తుంది. అయితే షూటింగ్ విరామ సమయంలో అంతా కుటుంబమంతా కలిసి బయటికి వెళతారు.

మరిన్ని వార్తలు