382 ప్లాట్లు, విల్లాలు సీజ్‌

7 Feb, 2017 12:31 IST|Sakshi
382 ప్లాట్లు, విల్లాలు సీజ్‌

గ్రేటర్‌ నోయిడా: ది గ్రేటర్‌ నోయిడా ఇండస్ట్రియల్‌ అథారిటీ అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 382 ఫ్లాట్లను, విల్లాలను సీజ్‌ చేసే చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే ఆ చర్యను ప్రారంభించి 30 విల్లాలను స్వాధీనం చేసుకుంది. అథారిటీ పేర్కొన్న ఏ నిబంధనలు కూడా కాంట్రాక్టర్లు పాటించని నేపథ్యంలో ఈ చర్యలకు దిగింది. గ్రేటర్‌ నోయిడాలోని సూపర్‌టెక్‌ సీజార్‌ స్యూట్స్‌ ప్రాంతాల్లో కొంతమంది బిల్డర్లు భారీగా విల్లాలను, ప్లాట్లను నిర్మిస్తున్నారు.

అయితే, వీటిల్లో భద్రత పరమైనవి, ప్లాట్లకు ​ఉండాల్సిన ఖాళీ స్థలాలు, పార్కింగ్‌ ప్లేస్‌లు, నివాసానికి అనుకూలంగా ఉండే పరిమాణంవంటి విషయాలను పూర్తిగా పక్కకు పెట్టి నిర్మిస్తున్నారు. లే అవుట్‌లో జీఎన్‌ఐడీఏకు ఎలాంటి ప్లాన్‌లు వివరించారో వాటికి పూర్తి భిన్నంగా నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన కేసు ఇప్పటికే కోర్టులో ఉంది.

అయితే, దీనిపై రేపు తుది ప్రకటన రావాల్సి ఉంది. అయితే, అలహాబాద్‌ కోర్టు మాత్రం ఆ ఇళ్లకు అనుమతులు ఇవ్వొద్దని, వెంటనే నిబంధనలు అతిక్రమించిన ప్లాట్ల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం అథారిటీ తరుపున వెళ్లి విచారించగా నిబంధనలు పాటించని 382 ప్లాట్లు విల్లాలు గుర్తించారు. ఈ నేపథ్యంలో వాటిని సీజ్‌ చేసే చర్యలు కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు