తెహల్కా ఎడిటర్‌ తేజ్‌పాల్‌కు ఎదురుదెబ్బ

7 Sep, 2017 15:22 IST|Sakshi

గోవా : లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా ఎడిటర్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌ కు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై అభియోగాలు నమోదు చేయాలని గోవా కోర్టు గురువారం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాలపై తరుణ్‌ తేజ్‌పాల్‌ న్యాయవాది మాట్లాడుతూ.. ఈ కేసు ఫైనల్‌ ఛార్జ్‌షీటులో 376 సెక్షన్‌ లేదని అన్నారు.

 కాగా తన వద్ద పనిచేసే మహిళా జర్నలిస్ట్ను తేజ్పాల్ లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. గోవాలోని ఓ ఫైఫ్ స్టార్ హోటల్‌లో తేజ్‌పాల్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ సంస్థలోని  మహిళా జర్నలిస్టు చేసిన సంచలన ఆరోపణలు అప్పట్లో దుమారం రేపాయి. హోటల్‌లోని ఓ లిఫ్టులోకి లాగి తేజ్‌పాల్ తనను వేధించారంటూ బాధితురాలు తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌధురీకి బాధితురాలు ఫిర్యాదు చేసింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు