ప్రత్యామ్నాయ నిర్మాణ సాంకేతికత తక్షణావసరం

6 Oct, 2016 03:01 IST|Sakshi
ప్రత్యామ్నాయ నిర్మాణ సాంకేతికత తక్షణావసరం

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు

 సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన లక్ష్యాలను చేరుకోవడానికి, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలుకు సంప్రదాయ నిర్మాణ పరిజ్ఞానానికి బదులుగా ప్రత్యామ్నాయ ప్రీఫ్యాబ్రికేటెడ్ నిర్మాణ సాంకేతిక పరిజ్ఞాన వినియోగం తక్షణావసరమని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఈ పరిజ్ఞానాన్ని ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ రంగం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. బుధవారం ఢిల్లీలో హౌసింగ్ టెక్నాలజీ పార్క్‌ను ప్రారంభించిన తర్వాత మాట్లాడుతూ ప్రత్యామ్నాయ నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానం వల్ల సురక్షిత, త్వరితగతిన నిర్మాణం చేపట్టవచ్చన్నారు.

ప్రత్యామ్నాయ నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానాలకు ప్రజాదరణ కల్పించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. పెద్ద గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లలో ఈ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారని, చిన్న తరహా ప్రాజెక్ట్‌లలో, వ్యక్తిగత గృహ నిర్మాణంలో కూడా వినియోగించాలని వెంకయ్య సూచించారు. కాగా, ప్రీఫ్యాబ్రికేటెడ్ ప్రత్యామ్నాయ సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై తెలుగు రాష్ట్రాలు అసక్తి కనబరుస్తున్నాయని గృహ నిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ నందిత చటర్జీ తెలిపారు.

మరిన్ని వార్తలు