బీజేపీలో చేరితే చంపుతామంటున్నారు!

11 Aug, 2019 16:10 IST|Sakshi
ఫరీన్‌ దంపతులు

అలీగఢ్‌: బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నందుకు సొంత వర్గీయులు తమను చంపుతామని బెదిరిస్తున్నారని బీజేపీకి చెందిన మైనార్టీ నాయకురాలు తన భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును ఆమోదిస్తూ ఇటీవల పార్లమెంటులో కొత్త చట్టం తీసుకొచ్చిన విషయం​ తెలిసిందే. ఈ చర్యతో ప్రధాని మోదీ పట్ల అభిమానంతో పలువురు ముస్లిం మహిళలు బీజేపీ పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారు. అంతేకాక బీజేపీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముస్లిం మహిళలు చెప్పుకోదగ్గ స్థాయిలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో యూపీలోని ఆలీగఢ్‌లో మైనారిటీ వర్గానికి చెందిన బీజేపీ నాయకురాలు ఫరీన్‌ మోసిన్‌ స్థానికంగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో తనకు బెదిరింపులు వచ్చాయనీ అంతేగాక, తన భర్త మహమ్మద్‌ మోసీన్‌పై అతని ఆఫీసులోనే దాదాపు ఏడెనిమిది మంది దాడి చేసి త్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు అనుకూలంగా వ్యవహరిస్తే నిన్నూ, నీ భార్యను చంపేస్తామని బెదిరించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన ఈ నెల 8న జరిగింది. అదే రోజు త్రిపుల్‌ తలాక్‌ బిల్లును ఆమోదిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. కాగా, ఈ కేసు విషయంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అలీగఢ్‌ ఏఎస్పీ అభిషేక్‌ తెలిపారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘చిక్కుల్లో కర్తార్‌పూర్‌ కారిడార్‌’

ప్రశాంతంగా జమ్మూకశ్మీర్‌!

ఆర్టికల్‌ 370 రద్దు.. ఉగ్రవాదం మటాష్‌!

‘ఆ నేరాలను అడ్డుకోలేం’

‘తలుపులు మూస్తేనే కదా.. ఓటింగ్‌ జరిగేది’

జొమాటోకు డెలి‘వర్రీ’

మోదీ, షా కృష్ణార్జునులు: సూపర్‌ స్టార్‌

కానిస్టేబుల్‌‌కు యావత్తు దేశం సెల్యూట్

మెట్రో రైలు కింద దూకి వ్యక్తి ఆత్మహత్య

నెహ్రు ఓ క్రిమినల్‌ : చౌహాన్‌

ఢిల్లీ నడివీధుల్లో కళ్లల్లో కారంచల్లి..

వరద విలయం

370 రద్దుపై ఎన్‌సీ సవాల్‌

సోనియా ఈజ్‌ బ్యాక్‌

ఇక కశ్మీర్‌ వధువులను తెచ్చుకోవచ్చు

ఇస్రో తదుపరి లక్ష్యం.. సూర్యుడు!

తరం మారుతున్నది.. స్వరం మారుతున్నది

సోనియా గాంధీకే మళ్లీ పార్టీ పగ్గాలు

మళ్లీ బ్యాలెట్‌కు వెళ్లం!

త్వరలో టిక్‌టాక్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌

పద్మ అవార్డులకు నామినేషన్ల వెల్లువ

పాక్‌కు చైనా కూడా షాకిచ్చింది!

ఔరా అనిపిస్తోన్న రెస్క్యూ టీం సాహసం

ప్రాణాలు కాపాడినవ్‌.. జవాన్‌కు పాదాభివందనం!

ఈనాటి ముఖ్యాంశాలు

రాడ్‌తో చంపి శవాన్ని బాత్‌రూమ్‌లో పడేశాడు

మిలిటెంట్ల డెన్‌లో అజిత్‌ దోవల్‌ పర్యటన

మొబైల్‌ఫోన్‌, ల్యాండ్‌లైన్‌ సేవలు రీస్టార్ట్‌!

మందుల కోసం కశ్మీర్‌ నుంచి ఢిల్లీకి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ట్రైలర్‌ చూసి మెగాస్టార్‌ మెసెజ్‌ చేశారు : ప్రభాస్‌

ఇక సినిమాలు తీయను : కే విశ్వనాథ్

కె.విశ్వనాథ్‌ ఆరోగ్యంగా ఉన్నారు!

శర్వానంద్‌లో నచ్చేది అదే : రామ్‌చరణ్‌

స్టార్‌ హీరోను ఆ ప్రశ్న అడిగిన అభిమాని..!

బిగ్‌బాస్‌.. తమన్నా అవుట్‌!