అవి అభివృద్ధి ప్రతిబంధకాలు: వెంకయ్య

4 Nov, 2017 04:34 IST|Sakshi

న్యూఢిల్లీ: జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌(ఎన్జీటీ) వంటి ట్రిబ్యునల్స్‌ జారీచేస్తున్న మధ్యంతర ఉత్తర్వులు తరచుగా అభివృద్ధి ప్రతిబంధకాలుగా పరిణమిస్తున్నాయని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. పర్యావరణంపై ఎన్జీటీ నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో శుక్రవారం ఆయన మాట్లాడుతూ,.. ‘ట్రిబ్యునల్స్‌ ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నాయి. ట్రిబ్యునల్స్‌తో పాటు ఇతర నియంత్రణ సంస్థలు పనిని మరింత సులభతరం చేసేలా వ్యవహరించాలి. అంతేగాని అభివృద్ధి ప్రతిబంధకాలుగా ఉండకూడదు’ అని సూచించారు. వివాదం పరిష్కారమైతే మంచిదే గానీ..వివాదాన్ని వాయిదావేస్తే అభివృద్ధిని అడ్డుకున్నట్లేనని వెంకయ్య పేర్కొన్నారు. ఢిల్లీలో ఆప్‌ ప్రభుత్వ సరి–బేసి వాహన విధానాన్ని ఆయన తప్పుబట్టారు.

మరిన్ని వార్తలు