పోలవరం ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్దం

11 Jul, 2014 14:19 IST|Sakshi
పోలవరం ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్దం

న్యూఢిల్లీ : పోలవరం ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. ఆయన శుక్రవారం లోక్ సభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నామన్నారు. విభజన బిల్లు పాసయ్యాక  ఆర్డినెన్స్ తీసుకు రావటం అన్యాయమని ఆయన అన్నారు.  

ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర సరిహద్దులు మార్చేముందు ఇరు రాష్ట్రాల శాసనసభల అభిప్రాయం తీసుకోవాలని ఎంపీ వినోద్ డిమాండ్ చేశారు. ఈ నిబంధనను కేంద్రం పాటించలేదని ఆయన వ్యాఖ్యానించారు. పోలవరం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై సభలో మొదట చర్చ జరపాలని వినోద్ డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు