వైరల్‌ వీడియో: కరోనాపై పోలీసుల వినూత్న డ్యాన్స్‌

18 Mar, 2020 15:05 IST|Sakshi

తిరువనంతపురం: చైనాలో మొదలైన కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. రోజురోజుకీ దీని ప్రభావం మరింత ప్రబలుతోంది.ఈ నేపథ్యంలో కరోనాను నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యలు తప్పనిసరి. వీటిలో చేతులను శుభ్రంగా కడుక్కోవడం అతి ముఖ్యం. ఇప్పటికే కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సెలబ్రిటీలు సైతం దిగివస్తున్న విషయం తెలిసిందే. టీవీ ఆర్టిస్టుల నుంచి అగ్ర తారల వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ తమ వంతు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. తాజాగా పోలీసులు కూడా ప్రజల్లో అవగాహన పెంచేందుకు నడం బిగించారు. (ప్లీజ్‌ వారికి సాయం చేయండి.. కాజల్‌)

కేరళ రాష్ట్ర పోలీసు మీడియా సెంటర్ 1.24 సెకనుల ఓ వీడియోను మంగళవారం ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. ఈ వీడియోలో ఆరుగురు పోలీసులు ముఖానికి మాస్క్‌లు ధరించి  కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలను వివరించారు. పోలీసులు వినూత్నంగా డ్యాన్స్‌ చేస్తూ.. చేతులను శుభ్రంగా కడుక్కోవాలంటూ అవగాహన కల్పించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో ఇప్పటికే లక్షల మంది దీన్ని వీక్షించారు. ఇక 145 దేశాలకు కరోనా వ్యాప్తి చెందగా.. ప్రపంచ వ్యాప్తంగా 1,75,530 కేసులు నమోదయ్యాయి. దాదాపు ఏడు వేల మందిని కరోనా బలితీసుకుంది. (కరోనా: ఐఐటీ హైదరాబాద్‌ ప్రత్యేక శానిటైజర్‌!)

మరిన్ని వార్తలు